Advertisement

THE NEW YEAR MESSAGE which indicates 'NEW LIFE'

THE NEW YEAR MESSAGE which indicates 'NEW LIFE' నాకు శరణాగతుడవు కమ్ము

ఎందుకీ ఆందోళన?
నీ వ్యవహారములలో నన్ను శ్రద్ధ తీసుకోనీ!
వాటి గురించి ఆలోచించవలసినది నేను.
నీవు నాకు సర్వస్య శరణాగతి కావటం తప్ప నేను దేనికీ ఎదురుచూడటం లేదు.
నీవు నాకు సర్వస్య శరణాగతి ఎలా కావాలో తెలుసుకున్న తర్వాత, నేను నీ వ్యవహారములో జోక్యం చేసుకుంటాను.
అపుడు నీవు దేనిని గురించి భయపడవలసిన అవసరం ఉండదు.
నీ బాధలకు, భయాలకు వీడ్కోలు చెప్పవచ్చు.
అయితే నీ ప్రవర్తన నన్ను నమ్మనట్లుగా వుంది.
అలా కాకుండ నన్ను నీవు పూర్తిగా (గుడ్డిగా) నమ్ము.

నీవు నాకు శరణాగతుడవు కావటమంటే నీ కష్టాల నుండి, నీ సమస్యల నుండి, నీ దుఃఖాల నుండి నీ ఆలోచనలన్నీ నిన్ను వదిలిపోవటం.
వాటన్నింటినీ నా చేతులలో పెట్టి ఇలా ప్రార్థించు.
"ప్రభూ! నా భారమంతా నీవు స్వీకరించినందుకు కృతజ్ఞుడను. నాకు ఏది మంచిదో అది నీవు చేయగలవు."

జ్ఞాపకముంచుకో! నీవు మరలా వాటిని గురించి ఆలోచించటం ప్రారంభించినా, నీ బాధలు త్వరగా తీరిపోలేదని భావించినా నీవు నాకు శరణాగతుడవైనట్లు కాదని.
నీపై నాకు గల ప్రేమను నీవు నమ్మనట్లేనని, నీ జీవితాన్ని నా ఆధీనంలో వుంచటానికి నీవు అంగీకరించటం లేదని తెలుసుకో.

జీవితం ఎలా ముగుస్తుందో? ఎలా జరుగుతుందో? అని నీవెప్పుడూ ఆలోచించవద్దు.
ఒక వేళ నీవలా ఆలోచించితే, నీవు నన్ను నమ్మనట్లే.
అసలు నీ భారము నన్ను వహించమంటావా? లేదా?
నీ భారము నన్ను వహించమంటే నీవు దేనిని గురించి ఆత్రుత చెందరాదు.
నీవు నాకు పూర్తిగా అర్పణ గావుంచుకున్నప్పుడు మాత్రమే నేను నీకు మార్గదర్శకుడిగా వుంటాను.
అప్పుడు నీవు ఊహించిన దానికన్నా, ఒక ప్రత్యేక మార్గములో నిన్ను నడిపిస్తూ, నా చేతులతో మోస్తాను.

నిన్ను బాధించే నీ ఆలోచనలు, బాధలు, ఆశలు ఎన్నైనా ఉండనీ, నేను ఏమైనా చేయగలను.
అది లౌకికమైనా లేక పారమార్థికమైనా.

ఎప్పుడు నీవు నా వైపు పూర్తిగా తిరిగి
"స్వామీ! నా భారమంతా నీదేనని" ప్రార్థించినప్పుడు, నీవు నన్ను పూర్తిగా విశ్వసించినప్పుడు, నిన్ను నాకే సమర్పించుకున్నప్పుడు, నీవు నాపై పూర్తిగా ఆధారపడినప్పుడు, నేను ఏదైనా చేయగలను. చేస్తాను.
నీవు కోరుకున్నట్లుగా నేను చేయాలనుకుంటే నీవు నన్ను నమ్మనట్లే.
నీ కోరికలను నాకు విన్నవించుకున్నట్లు మాత్రం అవుతుంది.

ఒక రోగి రోగ నివారణ కొరకు వైద్యుని వద్దకు వెళ్ళి, రోగనివారణోపాయం వైద్యునికి జెప్ప ప్రయత్నించినట్లుగా, నీవు నా వద్ద ప్రవర్తించవద్దు.
ఎప్పుడూ కూడ 'స్వామీ! ఈ సమస్య నిచ్చినందుకు కృతజ్ఞుడను.
దాని నివారణోపాయం కూడ తమరే అనుగ్రహించండి! నాకేది మంచిదో, అది మీకే తెలుసు' అని ప్రార్థించు.

కొన్ని సందర్భాలలో సమస్యలు తగ్గకుండా పెరుగుతూ వుంటాయి.
దానికి ఆందోళన చెందవద్దు.
నాపై పూర్తి విశ్వాసంతో కళ్ళుమూసుకొని ఇలా ప్రార్థించు.
"స్వామీ! మీరు దానిని చేయగలరు. అనుగ్రహించండి." అని ప్రార్థించినప్పుడు అవసరమైతే నేనెట్టి మహిమనైనా చేసి దానిని నివారణ గావిస్తాను.
నేనెప్పుడూ నీతోనే వుంటూ నీకు సహాయం చేస్తాను.
అయితే ఇదంతా ఎప్పుడు?
"నీవు నాకు సంపూర్ణ శరణాగతుడవైనప్పుడు మాత్రమే"

"శ్రీ సత్యసాయిబాబా"

LIFE'

Post a Comment

0 Comments